నుమాయిష్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-12-31T23:50:44+05:30 IST

పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్‌ ప్రారంభం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తూ సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

నుమాయిష్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్‌ ప్రారంభం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తూ సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు జనవరి 1 నుంచి నుమాయిష్‌ ముగిసే వరకూ ఉంటాయని తెలిపారు.

సిద్దిఅంబర్‌బజార్‌, జాంబాగ్‌ వైపు నుంచి నాంపల్లి వైపునకు వచ్చే బస్సులు, ప్రైవేటు బస్సులను ఎంజేమార్కెట్‌, ఆబిడ్స్‌ వైపునకు పంపుతారు.

పోలీస్‌ కంట్రోల్‌ రూం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు, బస్సులను ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌, బీజేఆర్‌ విగ్రహం మీదుగా ఆబిడ్స్‌ వైపునకు పంపుతారు.

బేగంబజార్‌ ఛత్రీ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు, గూడ్స్‌ వాహనాలను అలస్కా జంక్షన్‌ నుంచి దారుసలాం, ఏక్‌మినార్‌ వైపునకు పంపుతారు.

దారుసలాం, మూసాబౌలి నుంచి బేగంబజార్‌ వైపునకు వెళ్లే భారీ వాహనాలు, డీసీఎంలను బేగంబజార్‌, సిటీకాలేజ్‌, నయాపూల్‌ వైపునకు మళ్లిస్తారు.

Updated Date - 2022-12-31T23:50:46+05:30 IST