పోలీసులు కాదు.. ప్రజలే నాకు రక్షణ

ABN , First Publish Date - 2022-12-13T03:34:53+05:30 IST

ఒక ఎమ్మెల్సీ(కౌశిక్‌రెడ్డి)కి నాలుగు జీపుల పోలీసులతో భద్రత కల్పించడం విడ్డూరంగా ఉందని, ఇలాంటిది గతంలో తాను ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

పోలీసులు కాదు.. ప్రజలే నాకు రక్షణ

ఎమ్మెల్సీకి ఇంత భద్రత ఎప్పుడూ చూడలేదు: ఎమ్మెల్యే ఈటల

జమ్మికుంట, డిసెంబరు 12: ఒక ఎమ్మెల్సీ(కౌశిక్‌రెడ్డి)కి నాలుగు జీపుల పోలీసులతో భద్రత కల్పించడం విడ్డూరంగా ఉందని, ఇలాంటిది గతంలో తాను ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. తనను కుంగదీయడానికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలీసుల రక్షణ తనకు అవసరం లేదని, ప్రజలే తనకు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో సోమవారం బీజేపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తాను కుంగిపోయే వ్యక్తిని కాదన్న విషయాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఎన్నికల వేళ కేసీఆర్‌ ఇచ్చే హామీలు, పథకాలు వంటివన్నీ మోసాలేనని విమర్శించారు. నియోజకవర్గానికి నిధులు కావాలంటే మంత్రి దగ్గరికి వెళ్లాలని చెప్పడం బాధాకరమన్నారు. కేసీఆర్‌ బంధువులు ఇసుక మీద కన్నేసి వాగులు లేకుండా చేస్తున్నారని అన్నారు.

Updated Date - 2022-12-13T03:34:53+05:30 IST

Read more