కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ము లేదా?: షర్మిల

ABN , First Publish Date - 2022-12-31T03:50:27+05:30 IST

కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము బీజేపీకి లేదా అని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు.

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ము లేదా?: షర్మిల

హైదరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము బీజేపీకి లేదా అని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో సీబీఐ విచారణను అడిగిన బీజేపీ కేసీఆర్‌ అవినీతిపై దర్యాప్తును ఎందుకు కోరటం లేదన్నారు. కేసీఆర్‌ అవినీతిలో బీజేపీ నేతలకు కూడా వాటా ఉందా? అనినిలదీశారు. కేసీఆర్‌ ఒక అవినీతి శక్తి అంటూ మోదీ, అమిత్‌షా... కేసీఆర్‌ అవినీతిని బయట పెడతాం, జైలుకు పంపుతామని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు మాట్లాడుతుంటారని వారి మాటలు ఢిల్లీ కోటలు దాటినా.. చేతలు గోల్కొండ కోటకే పరిమితమయ్యాయి అంటూ ఎద్దేవా చేశారు. ‘నువ్వు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడ్చినట్లు చేస్తా’ అన్నట్లుగా బీజేపీ, టీఆర్‌ఎ్‌సల వ్యవహారం ఉందని శుక్రవారం ఆమె ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-12-31T03:50:46+05:30 IST

Read more