రోహిత్‌రెడ్డిపై నమ్మకం లేదా?
ABN , First Publish Date - 2022-12-15T03:18:33+05:30 IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుయత్నం కేసులో ఫిర్యాదుదారు...
భవిష్యత్తులో మాట మారుస్తారని అనుమానమా?
రాష్ట్ర బీజేపీ తరఫున హైకోర్టులో కీలక వాదనలు
ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై ఉమ్మడి రాష్ట్ర జీవోల వివరాలివ్వండి: హైకోర్టు
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుయత్నం కేసులో ఫిర్యాదుదారు అయిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేయించడం ద్వారా సిట్ అనూహ్యంగా ప్రవర్తించిందని బీజేపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ఎదుట రోహిత్‌రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేయించడం ద్వారా సిట్ అధికారులు గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్ర వర్తించారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బది లీ చేయాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ, నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి, ప్రతిపాదిత నిందితు లు భూసారపు శ్రీనివాస్, తుషార్ తదితరులు దాఖలు చేసి న రిట్ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. బీజేపీ తరఫున జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ఏదైనా కేసులో బాధితులు, సాక్షుల స్టేట్మెంట్లను మాత్రమే రికార్డు చేస్తారని.. ఇక్కడ బాధితుడు, సాక్షి కూడా కాని రోహిత్‌రెడ్డి వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై సిట్‌కు, ప్రభుత్వానికి విశ్వా సం లేదా? లేక ఆయన భవిష్యత్తులో మాట మార్చే అవకాశం ఉందన్న అనుమానం వచ్చిందా? అని అడిగారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్‌కు ఎటువంటి అధికారం, పరిధి లేకుండా జరిగిందని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ దర్యాప్తునకు ఎలాంటి చట్టబద్ధత లేదన్న విష యం ఏసీబీ కోర్టు ఆదేశాలతో తేలిపోయిందని పేర్కొన్నారు.
సాధారణ పోలీసులు ఏసీబీ కేసులను దర్యాప్తు చేయలేరు..
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఏసీబీ కేసులను విచారించేందుకు జీవోలు జారీచేశాయని.. వాటి ప్రకారం ప్రత్యేకంగా ఏసీబీ పోలీ్‌సస్టేషన్లు, ప్రత్యేక కోర్టులు ఉన్నాయని న్యాయవాది ప్రభాకర్ తెలిపా రు. ఆ జీవోలను నూతన జీవోల ద్వారా సవరించకుండా సా ధారణ పోలీసులు ఏసీబీ కేసులను దర్యాప్తు చేయలేరని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17లో వివరణ ఉందని.. ఆ సెక్షన్ ప్రకారమే అప్పటి ప్రభుత్వాలు జీవోలు ఇచ్చాయని, అవి ఇప్పటికీ మనుగడలో ఉన్నాయని తెలిపారు. ఈ అంశాలన్నీ ప్రభుత్వం, సిట్ దు రుద్దేశాన్ని, పక్షపాతాన్ని తెలియజేస్తున్నాయని.. దురుద్దేశం ఉన్నచోట దర్యాప్తు పారదర్శకంగా ఉండదని చెప్పారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఏసీబీ పోలీస్ స్టేషన్, ప్రత్యేక కోర్టుల పరిధి పాత జీవోలను సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.