Naveen Reddy : వీడియోలో మాట్లాడిన దానికి భిన్నంగా స్టేట్‌మెంట్..
ABN , First Publish Date - 2022-12-15T11:23:48+05:30 IST
నవీన్‌రెడ్డి స్టేట్‌మెంట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. అరెస్ట్ సమయంలో విడుదలైన వీడియోలో చెప్పిన విషయాలకు పూర్తి భిన్నంగా నవీన్‌రెడ్డి స్టేట్‌మెంట్ ఉంది.
Naveen Reddy : నవీన్‌రెడ్డి స్టేట్‌మెంట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. అరెస్ట్ సమయంలో విడుదలైన వీడియోలో చెప్పిన విషయాలకు పూర్తి భిన్నంగా నవీన్‌రెడ్డి స్టేట్‌మెంట్ ఉంది. తనకూ వైశాలికి అసలు వివాహమే జరగలేదన్నాడు. వైశాలి, తాను కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాళ్లమని.. పెళ్లి చేసుకోలేదనే కోపంతో కిడ్నాప్ చేశానని తెలిపాడు. వైశాలి పెళ్లి ఆపాలనే బాపట్ల పెళ్లి డ్రామా ఆడినట్టు నవీన్‌రెడ్డి పేర్కొన్నాడు. మిస్టర్‌టీకి చెందిన 40 మందితో వైశాలిని కిడ్నాప్ చేయించానని వెల్లడించాడు. వైశాలిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశానన్నాడు. కిడ్నాప్ ఇష్యూ పెద్దది కావడంతో భయపడిపోయినట్టు తెలిపాడు. రుబెన్ సాయంతో వైశాలిని వదిలి గోవా పారిపోయానని వెల్లడించాడు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో ఫొటోలు, వీడియోలు పెట్టానన్నాడు. వైశాలిని తాను ఏం చేయాలని అనుకోలేదని నవీన్‌రెడ్డి తెలిపాడు.