నాట్య మయూరి కూచిపూడి డాన్స్‌ అకాడమి వార్షికోత్సవం

ABN , First Publish Date - 2022-12-02T23:42:28+05:30 IST

రవీంద్రభారతిలో నాట్య మయూరి కూచిపూడి డ్యాన్స్‌ అకాడమీ 5వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నాట్య గురువు సౌందర్య కౌశిక్‌ శిష్య బృందం శాస్త్రీయ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించింది.

నాట్య మయూరి కూచిపూడి డాన్స్‌ అకాడమి వార్షికోత్సవం

రవీంద్రభారతి, డిసెంబర్‌ 2(ఆంధ్రజ్యోతి): రవీంద్రభారతిలో నాట్య మయూరి కూచిపూడి డ్యాన్స్‌ అకాడమీ 5వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నాట్య గురువు సౌందర్య కౌశిక్‌ శిష్య బృందం శాస్త్రీయ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించింది. 31మంది కళాకారులు వివిధ కీర్తనలు, శబ్దాలు, తరంగం అంశాలపై నర్తించారు. అనంతరం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, డా.మంజుల అనగాని, గీతా భాస్కర్‌, శివశంకర భాగవతుల, ఎం.వేణుగోపాల్‌రెడ్డి కళాకారులను సత్కరించారు.

Updated Date - 2022-12-02T23:42:32+05:30 IST