National Anthem: మెట్రో రైళ్లు సహా ఎక్కడికక్కడ స్తంభించిన తెలంగాణ

ABN , First Publish Date - 2022-08-16T17:21:41+05:30 IST

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల (Vajrotsavalu)ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.

National Anthem: మెట్రో రైళ్లు సహా ఎక్కడికక్కడ స్తంభించిన తెలంగాణ

హైదరాబాద్ (Hyderabad): 75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల (Vajrotsavalu)ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సామూహికంగా జాతీయ గీతాలాపన (National Anthem) కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అబిడ్స్‌లో ఉదయం 11:30 గంటలకు సీఎం కేసీఆర్ (CM KCR) జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక అన్ని ట్రాఫిక్ జంక్షన్లలో నిమిషం పాటు రెడ్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో జాతీయ గీతం పాడారు. దీంతో హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ నిమిషం పాటు అంతా స్తంభించిపోయింది. అన్ని మెట్రో రైళ్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులు, అన్ని వాహనాలు, ప్రజానీకం ఒక్కసారిగా నిలిచిపోయింది. మెట్రో సర్వీసులు సహా అన్ని చోట్లా జనం ఏక కాలంలో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.

Updated Date - 2022-08-16T17:21:41+05:30 IST