పాత్రికేయులకు మార్గదర్శి నార్ల

ABN , First Publish Date - 2022-12-07T03:39:56+05:30 IST

పాత్రికేయుడిగా గొప్ప విలువలతో నార్ల వెంకటేశ్వరరావు జీవించారని సీనియర్‌ పాత్రికేయుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్‌ అన్నారు.

పాత్రికేయులకు మార్గదర్శి నార్ల

సీనియర్‌ పాత్రికేయులు టంకశాల అశోక్‌

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో స్మారకోపన్యాసం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పాత్రికేయుడిగా గొప్ప విలువలతో నార్ల వెంకటేశ్వరరావు జీవించారని సీనియర్‌ పాత్రికేయుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్‌ అన్నారు. నార్ల జయంతిని పురస్కరించుకుని డాక్టర్‌ బీర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో మంగళవారం స్మారకోపన్యాసం చేశారు. నార్ల మూడు పదుల వయస్సులోనే అంతర్జాతీయ పరిణామాలపైవ్యాసాలు, పుస్తకాలు రాశారన్నారు.ప్రస్తుతం యువ జర్నలిస్టులలో విషయ పరిజ్ఞానం, అధ్యయనం లోపిస్తోందని, ఇది సమాజానికి మంచి చేయదన్నారు. వైస్‌ చాన్సలర్‌ కె.సీతారామారావు మాట్లాడుతూ నార్ల కుటుంబ సభ్యులు ఆయన రాసిన, సేకరించిన పుస్తకాలను యూనివర్సిటీ లైబ్రరీకి అందించారన్నారు. వీటిని డిజిటలైజ్‌ చేస్తామన్నారు. వర్సిటీ అకడమిక్‌ డైరెక్టర్‌ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్‌ ఏవీఎన్‌ రెడ్డి ప్రసంగించారు.

Updated Date - 2022-12-07T03:39:57+05:30 IST