ఇంట్లోకి చొరబడి వ్యక్తి హత్య

ABN , First Publish Date - 2022-08-04T05:58:57+05:30 IST

ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా హత్య చేసిన సంఘటన మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా: ఇంట్లోకి చొరబడి

ఇంట్లోకి చొరబడి వ్యక్తి హత్య

మాదాపూర్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా హత్య చేసిన సంఘటన మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ప్రేమ్‌రామ్‌(28) కొంతకాలం క్రితం నగరానికి వచ్చి కొండాపూర్‌లోని సిద్దిఖ్‌నగర్‌లోని 8వ నెంబర్‌ వీధిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ప్రేమ్‌రామ్‌ను కత్తితో దారుణంగా పోడిచి చంపి, పరారయ్యాడు. ఇంటి యజమాని మౌలానా ప్రేమ్‌రామ్‌ను కలిసేందుకు వెళ్లగా రక్తపు మడుగులో చనిపోయి పడిఉన్న ప్రేమ్‌రామ్‌ను చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే మాదాపూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం రెండు బృందాలు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-04T05:58:57+05:30 IST