Munugodu by-poll: ప్రభాకర్ రెడ్డికి బీ ఫామ్ అందజేసిన కేసీఆర్.. ఎన్నికల ఖర్చు కోసం ఎంత మొత్తం ఇచ్చారంటే?

ABN , First Publish Date - 2022-10-07T22:51:54+05:30 IST

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ బీ ఫామ్‌ను ప్రగతి భవన్‌లో అందచేసారు.

Munugodu by-poll: ప్రభాకర్ రెడ్డికి బీ ఫామ్ అందజేసిన కేసీఆర్.. ఎన్నికల ఖర్చు కోసం ఎంత మొత్తం ఇచ్చారంటే?

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ బీ ఫామ్‌ను ప్రగతి భవన్‌లో అందచేసారు. అలాగే ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును అందచేశారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు ముుఖ్యమంత్రికి కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు. బీ ఫామ్ ఇచ్చే సమయంలో ప్రగతి భవన్‌లో నల్గగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు. 





అంతకు ముందు మునుగోడు(MunuGodu) టీఆర్‌ఎస్‌ (TRS) అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి(Koosukuntla Prabhakar Reddy)ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా(MLA) కూసుకుంట్ల గెలిచారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) చేతిలో ఓటమి పాలయ్యారు. మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న కూసుకుంట్ల.. ఈనెల 10న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి హాజరుకానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి ‍స్రవంతి పోటీ చేస్తున్నారు. 



Updated Date - 2022-10-07T22:51:54+05:30 IST