టీఎన్జీవో హైదరాబాద్‌ శాఖ అధ్యక్షుడిగా ముజీబ్‌

ABN , First Publish Date - 2022-11-14T02:51:50+05:30 IST

తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ అధికారుల(టీఎన్జీవో) సంఘం హైదరాబాద్‌ జిల్లా శాఖ అధ్యక్షుడిగా సయ్యద్‌ మాజిదుల్లా హుస్సేని(ముజీబ్‌) ఐదో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

టీఎన్జీవో హైదరాబాద్‌ శాఖ అధ్యక్షుడిగా ముజీబ్‌

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ అధికారుల(టీఎన్జీవో) సంఘం హైదరాబాద్‌ జిల్లా శాఖ అధ్యక్షుడిగా సయ్యద్‌ మాజిదుల్లా హుస్సేని(ముజీబ్‌) ఐదో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం జిల్లా కార్యదర్శిగా విక్రమ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని యూనియన్‌ కార్యాలయంలో టిఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌.. ముజీబ్‌కు ఎన్నిక ప్రొసీడింగ్స్‌ అందజేశారు. ముజీబ్‌ ఐదోసారి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ఆయన పనితీరుకు నిదర్శనమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌ అన్నారు. కాగా, టీఎన్జీవో హైదరాబాద్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ముజీబ్‌.. ఆదివారం హోం మంత్రి మహమూద్‌ అలీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన్ను అభినందించారు.

Updated Date - 2022-11-14T02:51:51+05:30 IST