ఆర్టీసీ ఉద్యోగుల కోసం మొబైల్ యాప్: సజ్జనార్
ABN , First Publish Date - 2022-11-13T03:57:24+05:30 IST
ఆర్టీసీ ఉద్యోగులకు పలురకాల సౌలభ్యం కోసం మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు పలురకాల సౌలభ్యం కోసం మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీలో వివిధ రకాల సేవలను డిజిటలైజ్ చేస్తున్న క్రమంలో ఉద్యోగుల విధినిర్వహణలో వారికి ఉపయోగపడే విధంగా రూపొందించిన ‘టీఎ్‌సఆర్టీసీ ఎంప్లాయి ఎంగేజ్‌మెంట్’ యాప్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 44,764 మంది ఉద్యోగులను సమన్వయం చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద బర్కత్‌పుర, కంటోన్మెంట్, హైదరాబాద్-2 డిపోలలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు రోజూవారీ సెలవులు, పే స్లిప్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ఈ యాప్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని ఆయన వివరించారు.