TS News: బండి సంజయ్‌ది టైం పాస్ యాత్ర: ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
ABN , First Publish Date - 2022-08-19T17:39:53+05:30 IST
బండి సంజయ్‌ది టైం పాస్ యాత్రని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)ది టైం పాస్ యాత్రని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు (Shambipur Raju)విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తామన్నారు. తమ కార్యకర్తలు అనుకుంటే గేటు కూడా దాటలేరని అన్నారు. బండి సంజయ్‌కు దమ్ముంటే ఢిల్లీ మీద దండయాత్ర చెయ్యాలన్నారు. కుల, మత ద్వేషాలు రెచ్చ గొట్టి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. పాదయాత్ర ఎందుకు?.. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచినందుకా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో బండి సంజయ్ ముందు చెప్పాలని శంబీపూర్ రాజు డిమాండ్ చేశారు.