ప్రజా సంక్షేమమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-18T05:17:00+05:30 IST

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప నిచేస్తోందని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం
చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ  

మియాపూర్‌/ వివేకానందనగర్‌కాలనీ, ఆగస్టు17(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప నిచేస్తోందని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మం జూరైన చెక్కులను ఎమ్మెల్యే గాంధీ బుధవారం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.27.96లక్షలను ఆస్పత్రిలో చి కిత్స పొందుతూ బిల్లులు చెల్లించేందుకు ఆర్థిక స్థోమతలేని వారికి అందజేశామన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాశినాథ్‌యాదవ్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌, కేఆర్‌కె రాజు, శ్రీహరి, కిరణ్‌ పాల్గొన్నారు. 

 మియాపూర్‌ (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలో నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న నేపఽథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దఎత్తున బైక్‌ర్యాలీగా బయలుదేరారు. కాగా ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాస్‌ జెండా ఊపి బైక్‌ర్యాలీని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో నా యకులు అనిల్‌రెడ్డి, శివరాజ్‌గౌడ్‌, షౌకతఅలీమున్నా, అష్ర ప్‌, ఖదీర్‌, బోయ కిషన, ప్రదీ్‌పరెడ్డి, సంతోష్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.  

 గచ్చిబౌలి (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కొండాపూర్‌లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై జోనల్‌ కమిషనర్‌ శంకరయ్య, కార్పొరేటర్‌ హమీద్‌పటేల్‌తో కలిసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపకమిషనర్‌ వెంకన్న, డిప్యూటీ డీఎంహెచ్‌వో సృజన, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వరదాచారి, ఎఎంహెచ్‌ నగే్‌షనాయక్‌, ఎఎంహెచ్‌ కార్తీక్‌, ఆర్‌ఎంవో విజయకుమారి, బ్లడ్‌బ్యాంకు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్లు వేరొనిక, మాలతీ, టీఆర్‌ఎస్‌ నాయకులు, వైద్యసిబ్బంది  పాల్గొన్నారు. 

 కొండాపూర్‌లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి పరీక్ష కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.25లక్షల వ్యయంతో అన్ని హంగులతో అత్యాధునిక సదుపాయాలతో నూతన కంటిపరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.  

Updated Date - 2022-08-18T05:17:00+05:30 IST