మిస్ సౌత్ ఇండియా 2022 గ్రాండ్ ఫినాలేలో మెరిసిన మోడళ్లు
ABN , First Publish Date - 2022-08-04T16:59:29+05:30 IST
మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2022 పదో ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చరిష్మాకృష్ణ మిస్ సౌత్ ఇండియా
హైదరాబాద్: మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2022 పదో ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చరిష్మాకృష్ణ మిస్ సౌత్ ఇండియా 2022 టైటిల్ గెలుచుకున్నారు. తెలంగాణకు చెందిన సంజన అక్కశం మిస్ సౌత్ ఇండియా క్వీన్ టైటిల్ గెలుచుకున్నారు. తమిళనాడుకు చెందిన డెబినీతా కర్, కర్ణాటకకు చెందిన సమృద్థి శెట్టి రన్నరప్‌గా నిలిచారు. మంగళవారం రాత్రి కొచ్చిలోని మెరిడియన్ హోటల్‌లో ఫైనల్స్ జరిగాయి. జూబ్లీహిల్స్‌లో బుధవారం నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు వచ్చాయని, ఐదు రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు టైటిల్‌కు పోటీ పడ్డారన్నారు.