Minister Puvvada: పోలవరంతో భద్రాచలానికి ముప్పు: పువ్వాడ అజయ్

ABN , First Publish Date - 2022-07-19T20:18:15+05:30 IST

పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Minister Puvvada: పోలవరంతో భద్రాచలానికి ముప్పు: పువ్వాడ అజయ్

హైదరాబాద్ (Hyderabad): పోలవరం (Polavaram) ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రం బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రాచలం (Bhadrachalam) పక్కన ఉన్న 5 గ్రామాలను తామే ఆదుకున్నామని చెప్పారు. పార్లమెంట్ (Parliament)లో బిల్లు పెట్టి 5 గ్రామాలను.. తెలంగాణ (Telangana)లో కలపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భారీ వరదలు వస్తే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan reddy) బాధితులను కలిశారా? అని ప్రశ్నించారు. గవర్నర్ (Governor) పర్యటిస్తే ఏం ఉపయోగం.. కేంద్ర మంత్రులు వస్తే ఉపయోగమని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy)కి ఇసుక, నోటూ, మూటలు తప్ప ఇంకేమీ తెలీదని విమర్శించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ (CM Jagan)పై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.

Read more