ఉక్కు సంకల్పానికి దిగొచ్చిన కేంద్రం

ABN , First Publish Date - 2022-12-10T02:54:50+05:30 IST

ఉద్యమ నేత కేసీఆర్‌ ఉక్కు సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ 2009 డిసెంబరు 9న కేంద్రంలోని ...

ఉక్కు సంకల్పానికి దిగొచ్చిన కేంద్రం

డిసెంబరు 9ని తలుచుకుంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

ద్యమ నేత కేసీఆర్‌ ఉక్కు సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ 2009 డిసెంబరు 9న కేంద్రంలోని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఆ రోజును తలుచుకుంటూ శుక్రవారం కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్కచేయకుండా ఆమరణ దీక్షకు పూనుకున్న కేసీఆర్‌ మనో బలానికి కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసిందన్నారు. ఉద్యమాన్ని గమ్యం వైపు మలుపు తిప్పి 60 ఏళ్ల ఆకాంక్షలకు సరికొత్త ఊపిరినిచ్చిన దినంగా డిసెంబరు 9ని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-10T02:54:58+05:30 IST