Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో నిందితుల విడుదలపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-08-19T18:41:54+05:30 IST

గుజరాత్ బిల్కిస్ బానో కేసులో నిందితుల విడుదలపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే...

Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో నిందితుల విడుదలపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..

హైదరాబాద్ (Hyderabad): గుజరాత్ బిల్కిస్ బానో (Bilkis Bano) కేసులో నిందితుల (Accused) విడుదల (Release)పై మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విట్టర్ వేధికగా స్పందించారు. అత్యాచార నిందితులను శిక్షించే చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన అత్యాచారం కేసులో తెలంగాణ ప్రభుత్వం  ఏం చేస్తోందని జరిగిన ట్రోలింగ్‌పై మంత్రి సమాధానం ఇచ్చారు. రేపిస్టులను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపామని తెలిపారు. 45 రోజుల తర్వాత వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. రేపిస్టులను చట్ట ప్రకారం శిక్షించే వరకు పోరాడాలన్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్,  ఐపీసీ, సీఆర్పీసీలోని లొసుగుల వల్ల  రేపిస్టులు తప్పించుకుంటున్నారన్నారు. ఏ రేపిస్ట్‌కూ.. బెయిల్ రాకుండా ఉండాలన్నారు. అత్యాచార కేసుల్లో దోషిగా తేలినప్పుడు వారు మరణించే వరకు జైలులోనే ఉంచాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా దేశమంతా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్న వేళ బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషులను పంద్రాగస్టు నాడే గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. 

Updated Date - 2022-08-19T18:41:54+05:30 IST