Hyderabad City: అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు
ABN , First Publish Date - 2022-12-31T11:35:46+05:30 IST
శనివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్
హైదరాబాద్ సిటీ: శనివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ నేపథ్యంలో శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు తిరుగుతాయని, చివరి రైలు ఒంటి గంటకు బయలుదేరి చివరి స్టేషన్‌కు 2 గంటలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు
కల్వరీ టెంపుల్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈనెల 31 అర్ధరాత్రి ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ లింగంపల్లి నుంచి అర్ధరాత్రి 1.15 గంటలకు బయల్దేరి, హైదరాబాద్ స్టేషన్‌కు 1.55గంటలకు చేరుతుంది. లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ స్పెషల్ లింగంపల్లి నుంచి అర్ధరాత్రి 1.30గంటలకు బయల్దేరి, ఫలక్‌నుమా స్టేషన్‌కు 2.55గంటలకు చేరుతుంది.