సహస్రార్జున మహరాజ్ జయంతి
ABN , First Publish Date - 2022-11-01T01:03:33+05:30 IST
రాజరాజేశ్వర సహస్రార్జున మహరాజ్ జయంతిని ఫట్కర్(ఖత్రి) సోమవారం ఘనంగా నిర్వహించారు.
రాజేంద్రనగర్, అక్టోబర్ 31(ఆంధ్రజ్యోతి): రాజరాజేశ్వర సహస్రార్జున మహరాజ్ జయంతిని ఫట్కర్(ఖత్రి) సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్‌కు చెందిన సోమవంశ సహస్రార్జున క్షత్రియ(ఎ్‌సఎ్‌సకే) సమాజ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజ్ కార్యాలయంలో యజ్ఞం నిర్వహించిన తర్వాత ఉప్పర్‌పల్లి బాలాజీ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. సమాజ్ అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్‌రావు మోంగ్లీ, సమాజ్ నాయకులు ఉమేశ్ చవాన్, రాజేశ్ హబీబ్, మహేశ్ చవాన్, రజనీకాంత్ తిర్మల్, బంగ్లా వాలా దశరథ్ పవార్, రామాలాల్ చవాన్, గాంబో నాగరాజ్, రాజ్‌కుమార్, జ్యోతి, దత్తారాం పడాల్, యోగి ఖత్రి దివాన్, నగరి సూర్యప్రకాశ్, గాయత్రి చవాన్, రాఖీ రత్నపురి, మానస దివాన్, శారదా హబీబ్, లలిత రత్నపురి పాల్గొన్నారు.