కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం మన దురదృష్టం: మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2022-03-12T19:57:46+05:30 IST
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్కు వరద సహాయం చేయలేదని ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన కేంద్రమంత్రికి కూడా మనసు రావడంలేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం మన దురదృష్టమన్నారు. కేంద్రం అనుసరిస్తున్నతీరు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వరద నీటికి కేంద్రం నుంచి ఇంతవరకు అరపైసా సహాయం కూడా రాలేదని కేటీఆర్ మండిపడ్డారు.