కేసీఆర్ ముంబై టూర్ హిట్టా.. ఫట్టా?
ABN , First Publish Date - 2022-02-21T23:21:31+05:30 IST
ముంబై: కాంగ్రెస్ లేకుండా పొలిటికల్ ఫ్రంట్ ఉంటుందని ఎప్పుడూ చెప్పలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు.

కాంగ్రెస్‌తో కలిసే ఫ్రంట్ ఉండాలని చెప్పాం: కేసీఆర్ ముంబై టూర్‌పై సంజయ్ రౌత్
ముంబై: కాంగ్రెస్ లేకుండా పొలిటికల్ ఫ్రంట్ ఉంటుందని ఎప్పుడూ చెప్పలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. మమతా బెనర్జీకి కూడా కాంగ్రెస్‌తో కలిసే ఫ్రంట్ ఉండాలని చెప్పామన్నారు. తొలి నుంచీ శివసేన వైఖరి ఇదేనని ఆయన స్పష్టం చేశారు. అందర్నీ కలుపుకుని వెళ్లే సమర్థత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉందని రౌత్ చెప్పారు. దేశానికి కొత్త అజెండా, దార్శనికత అవసరమని ఉద్ధవ్, పవార్‌లతో భేటీ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. బీజేపీయేతర ఫ్రంట్ కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటాన్ని వాళ్లు కూడా అభినందించారు.
అయితే తెలంగాణలో టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పొలిటికల్ రేస్ కొనసాగుతోంది. రెండు పార్టీల టార్గెట్ అసెంబ్లీలో అధికారమే. కానీ జాతీయ స్థాయిలో మాత్రం ఇవే రెండు పక్షాలు కలిసి పనిచేయగలవా? రాష్ట్రంలో కుస్తీ పడుతూ... ఢిల్లీలో దోస్తీ చేయడం అంత ఈజీ కాదని పరిశీలకులంటున్నారు. మరి ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి స్ట్రాటజీ అమలుచేస్తారో చూడాలంటున్నారు.