Telangana కోసం కేసీఆర్ కుటుంబంలో ఎవరూ బలి కాలేదు: KA Paul
ABN , First Publish Date - 2022-06-02T19:44:39+05:30 IST
తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కుటుంబంలో ఎవరూ బలి కాలేదని కేఏ పాల్ అన్నారు.

Hyderabad: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation day) సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ (KCR) కుటుంబంలో ఎవరూ బలి కాలేదని అన్నారు. ప్రజాశాంతి పార్టీ తరఫున శ్రీకాంత్ చారి తండ్రిని ఎమ్మెల్యేగా నిలబెడతామన్నారు. డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంత్ చారి తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న రోజని, ఆ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అమర వీరుల కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. 1200 మంది అమరవీరులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ ప్రజల కోసం ఉందని, వారి కోసం పోరాటం చేస్తామని కేఏ పాల్ స్పష్టం చేశారు.