ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త భానుప్రకాష్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ABN , First Publish Date - 2022-12-10T03:13:28+05:30 IST

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (ఎన్‌ ఐఎన్‌) సీనియర్‌ శాస్త్రవేత్త, బయోకెమిస్ట్రీ విభాగం సారథి డాక్టర్‌ జి.భానుప్రకాష్‌ రెడ్డికి పోషకాహార పరిశోధనా రంగంలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త భానుప్రకాష్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ఐయూఎన్‌ఎస్ ఫెలోగా ఎన్నిక

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (ఎన్‌ ఐఎన్‌) సీనియర్‌ శాస్త్రవేత్త, బయోకెమిస్ట్రీ విభాగం సారథి డాక్టర్‌ జి.భానుప్రకాష్‌ రెడ్డికి పోషకాహార పరిశోధనా రంగంలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ సైన్సెస్‌ (ఐయూఎన్‌ఎస్‌) ఫెలోగా ఆయన ఎన్నియ్యారు. జీవనశైలి కారణంగా వచ్చే పోషకాహార లోపాలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న భానుప్రకాష్‌.. గేట్స్‌ ఫౌండేషన్‌తోపాటు పలు అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు. బ్రిటన్‌లోని రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీతోపాటు పలు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఆయన ఫెలోగా ఉన్నారు. మధుమేహం, ఊబకాయంలపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. దాల్చినచెక్క, ఉసిరి, మిరియాల వంటి వాటిలో డయాబెటిక్‌ రెటినోపతిని అరికట్టే అపురూపమైన పదార్థాలున్నట్లు ఆయన కనుగొన్నారు. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో ‘విటమిన్‌ ఏ’ లోపంపై భానుప్రకాష్‌ విశ్లేషణ ఆధారంగా ప్రభుత్వాలు ‘విటమిన్‌ ఏ’ సప్లిమెంటేషన్‌ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్టు ఎన్‌ఐఎన్‌ శుక్రవారం తెలిపింది.

Updated Date - 2022-12-10T03:14:00+05:30 IST