ఆ నిధులివ్వకుంటే ప్రగతి భవన్ ముట్టడే
ABN , First Publish Date - 2022-12-31T03:52:43+05:30 IST
గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల్లోగా ఆ డబ్బును తిరిగివ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ హెచ్చరించింది.
ప్రభుత్వానికి తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ హెచ్చరిక
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల్లోగా ఆ డబ్బును తిరిగివ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ హెచ్చరించింది. ఈ మేరకు ఆ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో మౌలికవసతుల కల్పనకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండా దారి మళ్లించడం ఆర్థిక నేరమని ఆరోపించారు. దారి మళ్లించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.