Hyd: BJP రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసనకు Congress యత్నం

ABN , First Publish Date - 2022-07-03T20:07:09+05:30 IST

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన తెలపడానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు.

Hyd: BJP రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసనకు Congress యత్నం

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన తెలపడానికి కాంగ్రెస్ (Congress) నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ (Mettu Saikumar) నేతృత్వంలో గాంధీభవన్ నుంచి బయలుదేరిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నల్ల బెలూన్‌లను ఎగురవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫిషర్మన్ కాంగ్రెస్ ఛైర్మెన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా అవమానించిన ప్రధాని మోదీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గులేని బీజేపీ నాయకులు మోదీకి భజన చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా తెలంగాణ ఏర్పడిందని, రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఇసుమంత కూడా లేదని సాయి కుమార్ అన్నారు.

Updated Date - 2022-07-03T20:07:09+05:30 IST