Hyderabadలో నివసిస్తోన్న వివిధ రాష్ట్రాల ప్రజలతో సమ్మేళనాలకు BJP ప్లాన్
ABN , First Publish Date - 2022-06-29T21:04:25+05:30 IST
బీజేపీ పాలిత సీఎంలతో, హైదరాబాద్లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల ప్రజలతో సమ్మేళనాలకు బీజేపీ ప్లాన్..

హైదరాబాద్ (Hyderabad): జులైలో నగరంలో బీజేపీ (BJP) కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో, హైదరాబాద్లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల ప్రజలతో సమ్మేళనాలకు బీజేపీ ప్లాన్ (Plan) చేస్తోంది. ఈ సందర్బంగా బుధవారం బీజేపీ జాతీయ నేత మురళీధరరావు, ఇతర నేతలు ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. మొత్తం 15 సమ్మేళనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమ్మేళనాల కోసం వివిధ ప్రాంతాలను నేతలు ఎంపిక చేశారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా, డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలతో ముఖ్యమంత్రులు ఇంటరాక్ట్ అయితే రాజకీయంగా బీజేపీకి మద్దతు పెరుగుతోందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.