ఎట్టకేలకు Telanganaలో ప్రవేశించిన నైరుతి Monsoons
ABN , First Publish Date - 2022-06-14T17:50:44+05:30 IST
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణలో ప్రవేశించాయి.

Hyderabad: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు (Monsoons) ఎట్టకేలకు తెలంగాణ (Telangana)లో ప్రవేశించాయి. సోమవారం మధ్యాహ్నానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరకు విస్తరించాయి. వచ్చే 48 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు అంతటా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ జూన్ ఆందోళనకరంగానే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. రుతుపవనాల కదలికలు చురుగ్గా లేకపోవడం, జూన్లో సాధారణ వర్షపాతం కూడా నమోదయ్య అవకాశం కనిపించడంలేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
వానాకాలం సీజన్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయని అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ప్రటించాయి. జూన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని జులై, ఆగస్టు, సెప్టెంబర్లో సాధారణం కంటే అధికంగా పడతాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.