హైదరాబాద్: బేగం బజార్లో కైట్ ఫెస్టివల్ సందడి
ABN , First Publish Date - 2022-01-16T16:48:29+05:30 IST
సంక్రాంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ బేగం బజారులో కైట్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది.
హైదరాబాద్: సంక్రాంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ బేగం బజారులో కైట్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది. ‘నైట్ కైట్-ఫైట్’ పేరుతో పతంగుల పండుగను నిర్వహిస్తున్నారు. ఎల్ఈడీ కాంతుల్లో గాలిపటాలు ఎగురవేస్తున్నారు. డీజే డప్పుల దరువుతో ఓల్డ్ సిటీ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. కోడి పందాలు అంటే ఏపీ, జల్లికట్టు.. తమిళనాడు, పతంగుల పండుగ.. హైదరాబాద్ అని చెప్పవచ్చు. కులమతాలకు అతీతంగా ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది.