Hyderabadలో హోర్డింగ్లు, కటౌట్లు.. ఫిర్యాదుల వెల్లువ
ABN , First Publish Date - 2022-04-26T11:46:24+05:30 IST
Hyderabadలో హోర్డింగ్లు, కటౌట్లు.. ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్ సిటీ : నగరంలో హోర్డింగ్లు, అక్రమ ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధిస్తూ ఏప్రిల్ 20, 2020న పురపాలక శాఖ ఉత్తర్వులు (జీఓ-68) జారీ చేసింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నయా నిబంధనలు అమలులోకి వచ్చాయి. అయితే, టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు నిబంధనలకు తిలోదకాలిస్తూ ప్రధాన, అంతర్గత రహదారి అన్న తేడా లేకుండా కటౌట్లు, తోరణాలతో పాటు, నిషేధం ఉన్న హోర్డింగ్లకూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.
ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలను వెంటనే తొలగించే అధికారులు గులాబీ పార్టీకి జోలికి వెళ్లకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. ఈ మేరకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సెలవు పెట్టిన ఈవీడీఎం డైరెక్టర్.. ఆదివారం నుంచి మళ్లీ సెలవులో వెళ్లారు. వ్యక్తిగత, ఇతరత్రా కారణాలతో సెలవు పెట్టినా.. రెండేళ్లుగా అదే పునరావృతం కావడం చర్చనీయాంశమైంది.