నెరవేరనున్న ఖైరతాబాద్‌ వాసుల కల

ABN , First Publish Date - 2022-03-16T18:09:21+05:30 IST

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఖైరతాబాద్‌ వాసుల కల నెరవేరనుంది. గతంలో దానం నాగేందర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ..

నెరవేరనున్న ఖైరతాబాద్‌ వాసుల కల

నేడు 50 పడకల ఆస్పత్రి ప్రారంభం

హైదరాబాద్/ఖైరతాబాద్‌ : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఖైరతాబాద్‌ వాసుల కల నెరవేరనుంది. గతంలో దానం నాగేందర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖైరతాబాద్‌లో నిర్మించిన 50 పడకల ఆస్పత్రి బుధవారం ప్రారంభం కానుంది. 2009లో దానం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ. 11 కోట్ల రూపాయలతో జి ప్లస్‌ 4 అంతస్తులు నిర్మించారు. అప్పటి నుంచి  ప్రారంభానికి నోచుకోలేదు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో వైద్యశాఖ మంత్రి హరీ్‌షరావు ఆస్పత్రికి సిబ్బంది, నిధులు మంజూరు చేయడంతో బుధవారం ప్రారంభిస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభమయితే ఖైరతాబాద్‌ నియోజకవర్గ ప్రజలతోపాటు చుట్టు ప్రక్కల ఉన్న అనేక బస్తీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. మంత్రులు హరీ్‌షరావు, తలసాని, మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి, కార్పొరేటర్‌ విజయలక్ష్మి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు. 

Read more