Hyderabad Crime: చాంద్రాయణగుట్టలో యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-08-21T13:27:33+05:30 IST

చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు...

Hyderabad Crime: చాంద్రాయణగుట్టలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ (Hyderabad): చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య (Murder) చేశారు. అబూబాకర్ ఆమూది(25) అనే యువకుడిని కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. సలాల బరకస్, అబ్దుల్ రహ్మాన్ బాక్రతో అబూబాకర్ ఘర్షణ పడినట్లుగా సమాచారం. ఫలక్నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Read more