ఎన్జీటీ తీర్పుపై ఎలా ముందుకెళ్దాం?

ABN , First Publish Date - 2022-12-31T04:58:24+05:30 IST

పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పు పర్యవసానాలు, ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించేందుకు రాష్ట్ర..

ఎన్జీటీ తీర్పుపై ఎలా ముందుకెళ్దాం?

న్యాయ నిపుణులతో నేడు అధికారుల భేటీ

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పు పర్యవసానాలు, ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు శనివారం న్యాయనిపుణులతో సమావేశం కానున్నారు. రెండో దశ పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రెండు ప్రాజెక్టుల పనులు చేపట్టారని ఆక్షేపిస్తూ మొత్తం రూ.920కోట్లు పరిహారం చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ జరిమానాను మూడు నెలల్లోగా కృష్ణా బోర్డు ఖాతాలో జమ చేయాలని, దీన్ని కృష్ణా నదీ ప్రక్షాళన కోసం వినియోగించాలని, తీర్పు వెలువడిన నెల రోజుల్లోపు కమిటీ వేయాలని ఆదేశించింది. ఈ అంశంపై శనివారం జలసౌధలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ నేతృత్వంలో న్యాయనిపుణులతో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఎన్జీటీ తీర్పులు ఏ విధంగా వ చ్చాయి? వాటి అమలు పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై ఆ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎ్‌సఎల్‌పీ) దాఖలు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు, ఎన్జీటీ తీర్పును అమలు చేసేందుకు కృష్ణా బోర్డు చర్యలు చేపట్టింది. ఉన్నత స్థాయి అధికారులతో ఓవర్‌సైట్‌ కమిటీ(కృష్ణా నదీ ప్రణాళనకు అన్ని విధాల చర్యలు తీసుకునే కమిటీ) వేసేందుకు కసరత్తు చేస్తోంది.

Updated Date - 2022-12-31T04:58:24+05:30 IST

Read more