గృహిణి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-13T00:49:15+05:30 IST

ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది.

గృహిణి ఆత్మహత్య

హైదర్‌నగర్‌, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరుకు చెందిన కోటేశ్వరరావు.. భార్య శివరంజని(36), ఇద్దరు పిల్లలతో కలిసి కేపీహెచ్‌బీ కాలనీ మూడో రోడ్‌లో నివసిస్తున్నారు. శివరంజని కొంతకాలంగా మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతోంది. ఆదివారం ఉదయం కోటేశ్వరరావు, పిల్లలు కాలేజీకి వెళ్లారు. వారు సాయంత్రం ఇంటికి రాగా తలుపులు వేసి ఉన్నాయి. కొట్టిన తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా శివరంజని ఉరేసుకొని ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-13T00:49:15+05:30 IST

Read more