హెచ్‌ఎండీఏప్లాట్ల వేలం..సందేహాల నివృత్తికి ప్రీ బిడ్‌

ABN , First Publish Date - 2022-02-23T14:34:26+05:30 IST

బహదూర్‌పల్లి, తొర్రూర్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్లలోని ప్లాట్లను వచ్చే నెలలో ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించనున్నారు. దీనిపై సందేహాలు ఉన్న

హెచ్‌ఎండీఏప్లాట్ల వేలం..సందేహాల నివృత్తికి ప్రీ బిడ్‌

నేడు బహదూర్‌పల్లిలో.. 25న తొర్రూర్‌

హైదరాబాద్‌ సిటీ:  బహదూర్‌పల్లి, తొర్రూర్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్లలోని ప్లాట్లను వచ్చే నెలలో ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించనున్నారు. దీనిపై సందేహాలు ఉన్న వారు ప్రీబిడ్‌ సమావేశాలకు హాజరై సమాధానాలు పొందొచ్చని అధికారులు సూచించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో బహదూర్‌పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్‌లో 101 పాట్ల విక్రయాలకు సంబంధించి ప్రీబిడ్‌ సమావేశం మేకల వెంకటేశ్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్‌లో 117 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన 223 ప్లాట్లకు సంబంధించి ప్రీబిడ్‌ సమావేశం ఈనెల 25న తొర్రూర్‌ అదే స్థలంలో జరగనుంది. 

Read more