బాబోయ్... భాగ్యనగరంలో ఎండలు మండుతున్నాయ్..!
ABN , First Publish Date - 2022-03-05T14:36:57+05:30 IST
నగరంలో ఎండలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నాలుగు రోజులుగా...
హైదరాబాద్ సిటీ : నగరంలో ఎండలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీల నుంచి 34డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. శుక్రవారం 34.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, సాయంత్రం 33.4 డిగ్రీలకు చేరాయి. కాగా, ఈనెల చివరి వారం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా రోజుకు 37 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.