Hyd: ఓల్డ్ సిటీలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ABN , First Publish Date - 2022-06-15T17:13:03+05:30 IST
Hyderabad: ఓల్డ్ సిటీ (Old city) లో భారీ వర్షం (Heavy Rains) కురిసింది.
Hyderabad: ఓల్డ్ సిటీ (Old city) లో భారీ వర్షం (Heavy Rains) కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఛత్రినాక, శివగంగానగర్, శివాజీనగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ఓల్డ్ సిటీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాగే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జాం కావడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, మలక్‌పేట్, గోషామహల్, ఆసిఫ్‌నగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో వర్షం కురిసింది.