ఘనంగా సింగిడి అవార్డుల ప్రదానం

ABN , First Publish Date - 2022-12-10T00:36:43+05:30 IST

ప్రతిభావంతులైన వారిని గుర్తించి గౌరవించడం అభినందనీయమని తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్‌ పర్సన్‌ దీపికారెడ్డి అన్నారు.

ఘనంగా సింగిడి అవార్డుల ప్రదానం

రవీంద్రభారతి, డిసెంబర్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రతిభావంతులైన వారిని గుర్తించి గౌరవించడం అభినందనీయమని తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్‌ పర్సన్‌ దీపికారెడ్డి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో సింగిడి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నాలుగవ సింగిడి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న వాణి, స్వరూప, ఖాజా మన్సూర్‌, అజయ్‌కుమార్‌, భాగ్య, సందీప్‌, శ్రీకాంత్‌, మేగ్యపవన్‌, కుమారస్వామి, ఒగ్గుప్రవీణ్‌, శీరీష, సింధు తపస్విలకు దీపికారెడ్డి అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన యువతకు పురస్కారాలతో ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, విశ్వకర్మ తదితరులు పాల్గొన్నారు. సభకుముందు ప్రముఖ నర్తకి మర్యాద కుల్‌శ్రేష్ఠ కథక్‌ నాట్యాన్ని ప్రదర్శించారు.

Updated Date - 2022-12-10T00:36:43+05:30 IST

Read more