గీత కార్మికులకు అండగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-10T00:36:37+05:30 IST

రాష్ట్రంలోని కల్లు గీత కార్మికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు.

 గీత కార్మికులకు అండగా ప్రభుత్వం

గీత కార్మికులకు అండగా ప్రభుత్వం

పీర్జాదిగూడ, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కల్లు గీత కార్మికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు. శుక్రవారం పీర్జాదిగూడలోని ఉప్పల్‌ డిపో వద్ద నిర్వహించిన తెలంగాణ గీత పని వారాల సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమానికి కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గీత కార్మికుల సంక్షేమానికి నీరా పాలసీని తీసుకువచ్చామని, హరితహారంలో భాగంగా మూడు కోట్ల ఈత చెట్లను నాటామని, రాబోయే రోజుల్లో వారికి హెల్త్‌ కవరేజ్‌ కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో పేద ప్రజల కోసం వారి హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు. కార్యక్రమంలో గీత పనివారాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్‌, సీపీఐ మండల కార్యదర్శి రచ్చ కిషన్‌, రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:36:37+05:30 IST

Read more