Brain dead: చనిపోతూ ఇద్దరికి ప్రాణదానం

ABN , First Publish Date - 2022-12-07T11:45:46+05:30 IST

ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి అవయవాల దానం చేసేందుకు

Brain dead: చనిపోతూ ఇద్దరికి ప్రాణదానం

గుండె, కాలేయం సేకరించిన జీవన్‌దాన్‌ సభ్యులు

హైదరాబాద్/సనత్‌నగర్‌: ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి అవయవాల దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు. మల్కాజిగిరి హనుమాన్‌ పేటకు చెందిన వైకే రాకేష్‌ కుమార్‌ (37) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఈ నెల 3న బైక్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రెండురోజులపాటు చికిత్స చేసినా స్పందించకపోవడంతో వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్‌ సభ్యులు రాకేష్‌ కుమార్‌ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో వారు అవయవదానానికి ఒప్పుకున్నారు. రాకేష్‌ కుమార్‌ లివర్‌, గుండెను జీవన్‌దాన్‌ సభ్యులు సేకరించారు. వీటితో ఇద్దరికి ప్రాణదానం చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-12-07T11:45:48+05:30 IST