తాండూరు కందులకు భౌగోళిక గుర్తింపు

ABN , First Publish Date - 2022-12-15T03:51:09+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు కందులకు కేంద్రప్రభుత్వం భౌగోళిక గుర్తింపునిచ్చింది.

తాండూరు కందులకు భౌగోళిక గుర్తింపు

తాండూరు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు కందులకు కేంద్రప్రభుత్వం భౌగోళిక గుర్తింపునిచ్చింది. దీంతో దేశంలోని వివిధ మార్కెట్లలో తాండూరు కందులకు విశిష్ట స్థానం లభించనుంది. కందులకు గిట్టుబాటు ధరతో పాటు కందిపప్పుకు కూడా డిమాండ్‌ పెరగనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటగా వ్యవసాయ ఉత్పత్తుల్లో కందికి ఈ గుర్తింపు లభించింది. 2019లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు తాండూరు కందిపై పరిశోధనలు చేశారు. ఇందుకోసం తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కూడా కృషి చేశారు. తాండూరు కందులకు భౌగోళిక గుర్తింపు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T03:51:11+05:30 IST