Ghattamaneni Family : ప్రతిరోజూ మేము మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాం

ABN , First Publish Date - 2022-11-15T11:51:33+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ఘట్టమనేని కుటుంబం ఒక ప్రకటన ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేసింది.

Ghattamaneni Family : ప్రతిరోజూ మేము మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాం

హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ఘట్టమనేని కుటుంబం ఒక ప్రకటన ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేసింది. ‘‘కృష్ణ గారి మృతి మా కుటుంబానికి తీరని లోటు. వెండితెరపైన కాకుండా నిజ జీవితంలోనూ ఆయన సూపర్ స్టారే. ఆయన మాతోనూ.. అలాగే ఆయన కారణంగా స్ఫూర్తి పొందిన జీవితాల్లోనూ ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ప్రతిరోజూ మేము ఆయన్ను మిస్ అవుతూనే ఉంటాం. కానీ మీరు చెప్పిన వీడ్కోలు ఎప్పటికీ శాశ్వతం కాదు. తిరిగి మనం కలుసుకునే వరకే’’ అని ప్రకటనలో ఘట్టమనేని కుటుంబం తెలిపింది.

 

Updated Date - 2022-11-15T11:51:34+05:30 IST