నిమజ్జనానికి వేళాయే..!

ABN , First Publish Date - 2022-09-08T17:44:57+05:30 IST

‘మహా’ నిమజ్జనం కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బుధవారం విగ్రహాల తరలింపు రూట్‌ మ్యాప్‌తోపాటు ట్రాఫిక్‌ ఆంక్షల వివరాలను అధికారులు వెల్లడించారు. గణేశ్‌ శోభాయాత్ర కేశవగిరి

నిమజ్జనానికి వేళాయే..!

హైదరాబాద్‌ సిటీ: ‘మహా’ నిమజ్జనం కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బుధవారం విగ్రహాల తరలింపు రూట్‌ మ్యాప్‌తోపాటు ట్రాఫిక్‌ ఆంక్షల వివరాలను అధికారులు వెల్లడించారు. గణేశ్‌ శోభాయాత్ర కేశవగిరి నుంచి ప్రారంభమవుతుంది. విగ్రహాలు చాంద్రాయణగుట్ట, మహబూబ్‌నగర్‌ క్రాస్‌రోడ్‌, ఫలక్‌నుమా, అలియాబాద్‌, చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, బషీర్‌బాగ్‌, లిబర్టీ, అంబేడ్కర్‌ విగ్రహం ద్వారా ఎన్‌టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌కు వెళ్తాయి.

 సికింద్రాబాద్‌ నుంచి వచ్చే విగ్రహాలు ఆర్‌పీరోడ్‌, ఎంజీరోడ్‌, కర్బలామైదాన్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్స్‌ (ఇక్కడ చిలకలగూడ గాంధీ ఆస్పత్రి వైపు నుంచి వచ్చే విగ్రహాలు కలుస్తాయి) ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, నారాయణగూడ క్రాస్‌రోడ్స్‌, హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ నుంచి ప్రధాన యాత్రతో కలిసి లిబర్టీ వైపు వెళ్తాయి. 

 ఉప్పల్‌, రామంతాపూర్‌ నుంచి వచ్చే విగ్రహాలు ఛే నెంబర్‌ జంక్షన్‌, అంబర్‌పేట్‌, శివంరోడ్‌, ఎన్‌సీసీ, ఫీవర్‌ ఆస్పత్రి, బర్కత్‌పుర, నారాయణగూడ క్రాస్‌ రోడ్స్‌ వద్ద ప్రధాన యాత్రకు కలుస్తాయి. 

 దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎ్‌ససదన్‌, సైదాబాద్‌, చంచల్‌గూడ, నల్లగొండ క్రాస్‌రోడ్‌ వైపు నుంచి వచ్చే నిమజ్జన యాత్ర అంబర్‌పేట్‌ వద్ద ప్రధాన యాత్రలో కలుస్తుంది.  టోలీచౌకి, రేతిబౌలి, మెహిదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు మాసబ్‌ట్యాంక్‌, అయోధ్య జంక్షన్‌, సైఫాబాద్‌, ఇక్బాల్‌మినార్‌, ఎన్‌టీఆర్‌మార్గ్‌కు వెళ్తాయి. ఎర్రగడ్డ నుంచి ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ నుంచి విగ్రహాలు సైఫాబాద్‌ వద్ద కలుస్తాయి. టప్పాచబుత్ర, ఆసి్‌ఫనగర్‌ నుంచి వచ్చే విగ్రహాలు సీతారామ్‌బాగ్‌, గోషామహల్‌ బారాదరి, అలస్కా మీదుగా ఎంజే మార్కెట్‌ వద్ద ప్రధాన యాత్రలో కలుస్తాయి. 

ట్రాఫిక్‌ ఆంక్షలు

 9వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్లే రూట్లలో ఇతర వాహనాలకు అనుమతి ఉండదు. విగ్రహాల నిమజ్జనంలో జాప్యం జరిగితే ఆంక్షల సమయం పెరిగే అవకాశం ఉంది. నెక్లె్‌సరోడ్‌, ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌, ఖైరతాబాద్‌, ఎన్‌టీఆర్‌మార్గ్‌, ఐమాక్స్‌ రోడ్డులో 10వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. 

 నిమజ్జనం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి వెళ్లే లారీలు, ట్రక్కులు నెక్లెస్‌ రోటరీ, ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌, వీవీ విగ్రహం, కేసీపీ మీదుగా వెళ్లాలి. వాహనాలను తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, మింట్‌ కాంపౌండ్‌ వైపు అనుమతించరు.  అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి వచ్చే లారీలు, ట్రక్కులను చిల్డ్రన్స్‌ పార్క్‌, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌ మీదుగా పంపిస్తారు. 

పార్కింగ్‌ ప్రదేశాలు

నిమజ్జన కార్యక్రమం చూడటానికి వాహనాల్లో వచ్చే వారు వాహనాలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, ఖైరతాబాద్‌ జంక్షన్‌, ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, ఖైరతాబాద్‌, ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం వరకు, బుద్ధభవన్‌ వెనక వైపు, గోసేవా సదన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ టెంపుల్‌, ఎన్‌టీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజ్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌. ఐమాక్స్‌ పక్కన పార్కింగ్‌ చేసుకోవచ్చు.

 నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాల నుంచి 8 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడపనున్నారు.


ఆర్టీసీ బస్సులు అక్కడి వరకే..

మెహిదీపట్నం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మాసాబ్‌ట్యాంక్‌ వద్ద, కూకట్‌పల్లి వైపు నుంచి వచ్చే వాటిని వీవీ విగ్రహం వద్ద, సికింద్రాబాద్‌ నుంచి వచ్చే బస్సులను చిలకలగూడ క్రాస్‌రోడ్స్‌ వద్ద, ఉప్పల్‌ వైపు నుంచి వచ్చే బస్సులను రామంతాపూర్‌ టీవీ స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే బస్సులను గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్‌ వద్ద, రాజేంద్రనగర్‌ వైపు నుంచి వచ్చే బస్సులను దానమ్మ గుడిసెలు, మిధాని బస్సులను ఐఎ్‌ససదన్‌, ఇంటర్‌సిటీ ప్రత్యేక బస్సులను వైఎంసీఏ, నారాయణగూడ,  తార్నాక నుంచి వచ్చే బస్సులను జామై ఉస్మానియా వరకే అనుమతిస్తారు.


నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన సీపీ 

కవాడిగూడ: ట్యాంక్‌బండ్‌పై గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. ప్రస్తుతం 8 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.  

సాగర్‌ తీరానికి తరలి రావాలి

అఫ్జల్‌గంజ్‌: శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనోత్సవాలకు హుస్సేన్‌సాగర్‌ తీరానికి భారీగా తరలిరావాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధానకార్యదర్శి భగవంత్‌రావు పిలుపునిచ్చారు. సాగర్‌లో సామూహిక గణేశ్‌ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేయడంతో కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన రిలే దీక్షను బుధవారం రాత్రి స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి భగవంత్‌రావుకు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. 


రాచకొండ కమిషనరేట్‌లో పరిధిలో.. 

కొత్తపేట: వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 9వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని సీపీ మహేష్‌ భగవత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిమజ్జనం రోజు వాహనాల మళ్లింపు, పార్కింగ్‌ అంశాలపై ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. 

 హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌ పరిధి శ్రీనివాస కాలనీ, మధురానగర్‌, బైరామల్‌గూడ, దుర్గానగర్‌ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను సరూర్‌నగర్‌ చెరువుకు తరలించే వాహనాలు ఎల్‌బీనగర్‌ జంక్షన్‌ మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌ వెంకటాద్రి థియేటర్‌, జేసీ బ్రదర్స్‌ షో రూం తర్వాత ఎడమవైపు మలుపు తీసుకొని శివగంగ థియేటర్‌ మీదుగా చెరువు వైపు వెళ్లాలి.

 హైదరాబాద్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, అంబర్‌పేట, మూసారాంబాగ్‌ వైపు నుంచి  వచ్చే వాహనాలు టీవీ టవర్‌ క్రాస్‌రోడ్స్‌ మీదుగా కోణార్క్‌ డయోగ్నస్టిక్‌ సెంటర్‌ వద్ద యూ టర్న్‌ తీసుకొని శివగంగ థియేటర్‌ మీదుగా చెరువు వైపు వెళ్లాలి. 

 సంతో్‌షనగర్‌, సైదాబాద్‌, ఐఎ్‌స సదన్‌ వైపు నుంచి వాహనాలు సింగరేణి కాలనీ శంకేశ్వర్‌ బజార్‌ మీదుగా సరూర్‌నగర్‌ చెరువు వద్దకు చేరుకోవాలి. 

 అధికారిక విధులు నిర్వహించే వారి వాహనాలను ఇందిరా ప్రియదర్శిని పార్కు వద్ద నిలపవచ్చు. సందర్శకుల వాహనాలు జ్యోతిక్లబ్‌, సరస్వతీ శిశుమందిర్‌, సరూర్‌నగర్‌ పోస్టాఫీస్‌ వద్ద జెడ్‌పీహెచ్‌ఎ్‌సలో నిలపాలి. 

 సరూర్‌నగర్‌ చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత ఖాళీ వాహనాలు ఇందిరా ప్రియదర్శిని పార్కు మీదుగా సరూర్‌నగర్‌ పాత పోస్టాఫీస్‌ క్రాస్‌ రోడ్స్‌ నుంచి కర్మన్‌ఘాట్‌ వైపు లేదా సరూర్‌నగర్‌ పోస్టాఫీస్‌ వైపు మాత్రమే వెళ్లాలి.

Updated Date - 2022-09-08T17:44:57+05:30 IST