ఇనార్బిట్ మాల్లో టీనేజర్లకు ఉచిత వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2022-01-20T15:52:59+05:30 IST
మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌ను సందర్శించేందుకు తల్లిదండ్రులతో పాటుగా వచ్చే పదిహేనేళ్లు దాటిన టీనేజర్లకు ఉచితంగా కొవిడ్ -19 వ్యాక్సిన్ తొలి మోతాదు..
హైదరాబాద్ సిటీ, జనవరి 19, (ఆంధ్రజ్యోతి): మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌ను సందర్శించేందుకు తల్లిదండ్రులతో పాటుగా వచ్చే పదిహేనేళ్లు దాటిన టీనేజర్లకు ఉచితంగా కొవిడ్ -19 వ్యాక్సిన్ తొలి మోతాదు అందించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతిరోజూ ఉదయం 11నుంచి సాయంత్రం 5 వరకు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని మాల్ హైదరాబాద్ సెంటర్ హెడ్ శరత్ బెలావడి తెలిపారు. టీకాలను వేయించాలనుకునే తల్లిదండ్రులు ఆరోగ్య సేతు యాప్‌లో ముందుగా తమ పిల్లల పేర్లను నమోదు చేసుకోవడంతో పాటుగా ఆధార్ కార్డులను సైతం తమతో పాటుగా తీసుకురావాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 80080 45704 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.