Petrol Station: మీటరుకు చిప్‌ అమర్చి మోసం

ABN , First Publish Date - 2022-11-18T11:37:12+05:30 IST

పెట్రోల్‌ బంకులో చిప్‌ అమర్చి లీటరుకు పది రూపాయల చొప్పున కాజేస్తున్న ముగ్గురిని అరెస్ట్‌

Petrol Station: మీటరుకు చిప్‌ అమర్చి మోసం

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: పెట్రోల్‌ బంకులో చిప్‌ అమర్చి లీటరుకు పది రూపాయల చొప్పున కాజేస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు, రాజేంద్రనగర్‌ పోలీసులు, పౌర సరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారులు బుధవారం రాత్రి సంయుక్తంగా శివరాంపల్లి పిల్లర్‌ నెంబర్‌ 313 పిల్లర్‌ వద్ద జి.యాదిరెడ్డికి చెందిన జీవైఎస్‌ రెడ్డి పెట్రోల్‌ బంకుపై దాడు లు నిర్వహించారు. బంకులోని మీటరుకు చిప్‌లు అమర్చి లీటరుకు రూ. 10 చొప్పున దోచుకుంటున్నారని గుర్తించారు. చాల సంవత్సరాలుగా ఇలాగే చేస్తున్నారని తెలుసుకు న్న అధికారులు అందుకు బాధ్యులైన సిద్దిపేట్‌కు చెందిన స్వర్ణం కిరణ్‌(39), చెంచల్‌గూడకు చెందిన షేక్‌ రహీం, నాచా రానికి చెందిన అజహార్‌ను అరెస్ట్‌ చేశారు. పెట్రోల్‌ బంకును సీజ్‌ చేశారు. పెట్రోల్‌ పోసేటప్పుడు ఉపయోగించే మీటరుకు ఎప్పటి నుంచి చిప్‌ అమరుస్తున్నారనే విషయమై ఆరా తీస్తున్నారు. రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-11-18T11:50:41+05:30 IST

Read more