స్నాచింగ్‌ కేసులో మాజీ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-09-28T16:32:19+05:30 IST

చైన్‌ స్నాచింగ్‌ కేసులో మాజీ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గచ్చిబౌలి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

స్నాచింగ్‌ కేసులో మాజీ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

హైదరాబాద్/రాయదుర్గం:  చైన్‌ స్నాచింగ్‌ కేసులో మాజీ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గచ్చిబౌలి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా, అనంతగిరి, పాలవర గ్రామానికి చెందిన గంటు రమేష్‌ కొండాపూర్‌ 8వ  బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. చెడు వ్యసనాలకు బానిసై సరిగ్గా విధులకు హాజరు కాకపోవడంతో అతడిని తొలగించారు. అప్పటి నుంచీ గ్రామంలో ఉన్న రమేష్‌ తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసేందుకు నాలుగు రోజులక్రితం నగరానికి వచ్చి 8వ బెటాలియన్‌లో ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కొత్తగూడలోని జీహెచ్‌ఎంసీ పార్కులో కేతావత్‌ రాధ వాకింగ్‌ చేస్తుండగా అక్కడే వాకింగ్‌ చేస్తున్నట్లు నటిస్తూ ఆమె మెడలోని సుమారు రూ.3.90 లక్షల విలువైన పుస్తెల తాడును తెంచుకుని పారిపోయాడు. ఆమె దొంగ దొంగ అని అరవడంతో వాకర్లు అతడిని పట్టుకునేందుకు వెంబడించారు. పక్కనే ఉన్న కాలనీలో స్థానికులు పట్టుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పుస్తెల తాడును స్వాధీనం చేసుకుని రమే్‌షను అరెస్ట్‌ చేశారు.  

Read more