Fire accident: హైదరాబాద్లో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-08-08T15:28:17+05:30 IST
నగరంలోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫీజ్ బాబా నగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్: నగరంలోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫీజ్బాబానగర్లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. హబీబ్ కిడ్స్వేర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూసి ఉన్న దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కిడ్స్వేర్లో ఉన్న బట్టలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి.