సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం

ABN , First Publish Date - 2022-12-15T03:56:28+05:30 IST

విద్యార్థుల హక్కులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గమని మాజీ ఎంపీలు ఎంఏ బేబి, నిలోత్పల్‌ బసు అన్నారు....

సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం

మాజీ ఎంపీలు ఎంఏ బేబి, నిలోత్పల్‌ బసు

హైదరాబాద్‌/సిటీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల హక్కులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గమని మాజీ ఎంపీలు ఎంఏ బేబి, నిలోత్పల్‌ బసు అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గల ఠాగూర్‌ ఆడిటోరియంలో జరుగుతున్న ఎస్‌ఎ్‌ఫఐ 17వ జాతీయ మహాసభలలో మాజీ నాయకులు సౌహార్ధ సందేశమిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా కాషాయీకరణ, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణతోపాటు కేంద్రీకరణ ప్రమాదకరమని హెచ్చరించారు. ఫాసిస్టు, మతతత్వ విధానాలను ఎన్‌ఈపీ ద్వారా విద్యారంగంలో అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా, దేశంలోని అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో విద్యార్ధి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఎ్‌ఫఐ జాతీయనాయకులు థీప్సితాధర్‌, దీనిత్‌డెంటా, నితీశ్‌నారాయణన్‌ డిమాండ్‌ చేశారు. 18 ఏళ్లకే విద్యార్థులు తమ ఓటుహక్కుతో ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నప్పుడు విద్యాసంస్థల్లో ప్రజాస్వామిక వాతావరణం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల సూచనల మేరకే నూతన విద్యావిధానంలో ప్రైవేటు యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలను అనుమతించకూడదనే నిబంధనను పొందుపరచారని వారు ఆరోపించారు.

Updated Date - 2022-12-15T03:56:29+05:30 IST