యువకుడ్ని బెదిరించిన నకిలీ పోలీసులు

ABN , First Publish Date - 2022-10-17T17:58:07+05:30 IST

బీకేగూడ పార్క్‌ వద్ద శనివారం రాత్రి గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడ్ని బెదిరించి డబ్బు వసూలు చేయడమేకాకుండా

యువకుడ్ని బెదిరించిన నకిలీ పోలీసులు

డబ్బు, సెల్‌ఫోన్‌ తీసుకుని పరారీ

హైదరాబాద్/అమీర్‌పేట: బీకేగూడ పార్క్‌ వద్ద శనివారం రాత్రి గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడ్ని బెదిరించి డబ్బు వసూలు చేయడమేకాకుండా అతడి సెల్‌ఫోన్‌ తీసుకుని పారిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మౌళి శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బీకేగూడ పార్క్‌ వైపు నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు అటకాయించారు. తాము పోలీసులమని.... రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. మౌళిని బెదిరించి అతని అకౌంట్లో ఉన్న రూ.14,500 నగదును సెల్‌ఫోన్‌ ద్వారా తమ అకౌంట్లోకి బదిలీ చేయించుకుని ఫోన్‌ తీసుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులు తెలిపారు.

Updated Date - 2022-10-17T17:58:07+05:30 IST