రెడ్‌ నోటీస్‌.. ఆపై కనెక్షన్‌ కట్‌

ABN , First Publish Date - 2022-12-07T12:44:23+05:30 IST

వాణిజ్య నీటి కనెక్షన్ల బకాయిలపై వాటర్‌బోర్డు దృష్టి సారించింది. బిల్లులు బకాయిలు ఉన్న 1095 మంది వాణిజ్య

రెడ్‌ నోటీస్‌.. ఆపై కనెక్షన్‌ కట్‌

1095 మందికి జారీ

వాణిజ్య నీటి బకాయిలపై బోర్డు దృష్టి

హైదరాబాద్‌ సిటీ: వాణిజ్య నీటి కనెక్షన్ల బకాయిలపై వాటర్‌బోర్డు దృష్టి సారించింది. బిల్లులు బకాయిలు ఉన్న 1095 మంది వాణిజ్య నల్లా కనెక్షన్‌దారులకు అధికారులు రెడ్‌ నోటీసులు జారీ చేశారు. ఆయా కనెక్షన్ల నుంచి వాటర్‌బోర్డుకు రూ.8.31 కోట్ల నీటి బకాయిలు రావాల్సి ఉంది. ఆరు నెలలకు పైగా బిల్లులు చెల్లించని వాణిజ్య కనెక్షన్లను గుర్తించి, విడతల వారీగా వివిధ నోటీసులు అందజేసిన వాటర్‌బోర్డు సిబ్బంది తాజాగా రెడ్‌ నోటీసులను అందిస్తున్నారు. గడువులోపు నీటి బకాయిలు చెల్లించాలని లేకుంటే కనెక్షన్లను తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఫ్రీ వాటర్‌ స్కీంలో చేరని..

నెలకు 20 వేల లీటర్ల ఉచిత పథకంలో చేరని గృహ కనెక్షన్లు సుమారు నాలుగు లక్షల వరకు ఉన్నాయి. ఆయా కనెక్షన్ల నుంచి ప్రతీ నెలా రూ.22 కోట్ల వరకు నీటి బిల్లులు వసూలు కావాల్సి ఉంది. కానీ, రూ. 7 కోట్ల లోపే వసూలు అవుతున్నాయి. దీంతో వాణిజ్య కనెక్షన్లతో పాటు ఉచిత తాగునీటి పథకంలో చేరని గృహ కనెక్షన్ల నీటి బకాయిలపై కూడా అధికారులు దృష్టి సారించారు.

Updated Date - 2022-12-07T12:44:25+05:30 IST